శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 15:10:42

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ తయారీ అత్యవసరం : బిల్‌గేట్స్‌

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ తయారీ అత్యవసరం : బిల్‌గేట్స్‌

భవిష్యత్ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను దేశాల్లో ప్రజలకు చాలా అవసరమని, దాన్ని అత్యవసరంగా అందుబాటులో ఉంచాలని బైక్రో సాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. శనివారం వర్చువల్ కోవిడ్19 సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందులు, టీకాల తయారీని వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇది ఘోరమైన మహమ్మారి అని దీన్నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సిన్ కోసం అన్వేషణ, ట్రయల్స్ నడుస్తోంది. వాషింగ్టన్‌లో కొంతమంది అధికారులతో టీకాను కనిపెట్టడానికి యూఎస్‌ బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది, యూఎస్‌ నివాసితులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. శుక్రవారం, UK ప్రభుత్వం సంభావ్య కరోనావైరస్ వ్యాక్సిన్ల సరఫరాను భద్రపర్చడానికి రూపొందించిన EU- విస్తృత పథకంలో చేరే ప్రతిపాదనను తిరస్కరించింది.


logo