మంగళవారం 26 జనవరి 2021
International - Dec 11, 2020 , 01:42:33

సీపీసీ చైర్‌పర్సన్‌గా ప్రమీల జయపాల్‌

సీపీసీ చైర్‌పర్సన్‌గా ప్రమీల జయపాల్‌

వాషింగ్టన్‌: భారత సంతతి అమెరికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీ నేత, అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌ కాంగ్రెషనల్‌ ప్రోగ్రెసివ్‌ కాకస్‌(సీపీసీ) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఫలితంగా అమెరికాలో అత్యంత శక్తిమంతమైన చట్టసభ్యుల్లో అమె ఒకరిగా నిలిచారు. అధికార పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో సీపీసీ కీలక పాత్ర పోషిస్తుంది. పేదరికం, జాతి వివక్ష నిర్మూలనకు సీపీసీ పనిచేస్తుందని ప్రమీల ఈ సందర్భంగా తెలిపారు.


logo