ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి

జకార్తా: ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో శుక్రవారం తెల్లవారుజామున 2.18 గంటలకు భూకంపం సంభవించడంతో 42 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.2గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావంతో ఒక దవాఖాన, పలు భవనాలు దెబ్బతిన్నాయి.
కొంత మంది ఇంకా శిధిలాల్లోనే చిక్కుకున్నారని భావిస్తున్నారు. భూ ప్రకంపనలతో సులవేసి దీవి వాసులు భయాందోళనకు గురయ్యారు. మళ్లీ సునామీ వస్తుందేమోనని భయపడ్డారు.రెండున్నరేండ్ల క్రితం సంభవించిన సునామీ వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో వెస్ట్ సులవేసి రాష్ట్రంలోని మముజు నగరంలో 34, దక్షిణ ప్రాంతంలో మరో ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. ఎంత మంది ఆచూకీ గల్లంతయ్యిందన్న విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన ఇంటి శిధిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది కుటుంబ సభ్యులను వెలికి తీయడానికి సహాయ సిబ్బంది ప్రయత్నించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.