గురువారం 09 ఏప్రిల్ 2020
International - Jan 27, 2020 , 22:27:35

సోలొమన్‌ ద్వీపాల్లో భూకంపం

సోలొమన్‌ ద్వీపాల్లో భూకంపం

సిడ్నీ : సోలొమన్‌ ద్వీపాల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. కానీ, ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీచేయలేదు. పసిఫిక్‌ దేశ రాజధాని హోనియారాకు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో 17.7 కి.మీ లోతున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు భూకంపం వచ్చినట్టు యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సముద్రగర్భంలో భూకంపం సంభవించినప్పటికీ సునామీ వచ్చే పరిస్థితి లేదని సోలొమన్‌ ద్వీపాల వాతావరణశాఖ పేర్కొన్నది. హోనియారాలోని వ్యాపార కేంద్రంలో ఆస్తినష్టం సంభవించినట్టు కనిపించే ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. సోలొమన్‌ ద్వీపాల్లో భూకంపాలు సర్వసాధారణం. 2013 సంవత్సరంలో 8.0 తీవ్రత భూకంపం కారణంగా భారీ సునామీ వచ్చింది. అప్పుడు 10 మంది చనిపోగా, వేల సంఖ్యలో ఇండ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.logo