మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 07:31:55

అలస్కాలో భారీ భూకంపం.. 7.8 తీవ్రత

అలస్కాలో భారీ భూకంపం.. 7.8 తీవ్రత

ఆంకరేజ్‌: అమెరికాలోని అలస్కా రాష్ట్రం దక్షిణ కోస్తా ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.12 గంటలకు సంభవించిన శక్తిమంతమైన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.8గా నమోదైంది. తొలుత అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. పెరివిల్లేకు దక్షిణ-ఆగ్నేయదిశగా సముద్ర జలాల్లో 105 కిమీ, కొడియాక్‌కు ఈశాన్య దిశగా 320 కి.మీ దూరంలో, 28 కి.మీ లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. భూకంప కేంద్రానికి 160 కి.మీ నుంచి 805 కి.మీ దూరం వరకు ప్రకంపనలు సంభవించాయి. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.


logo