తిరిగి ఇందిరమ్మ చేతిలోకి అధికారం

ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఇందిరాగాంధీ.. ఎవర్నీ ఖాతరు చేయకుండా దేశంలో ఎమర్జెన్సీని విధించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఇందిరాగాంధీ.. ఆ తర్వాత 1980 లో జరిగిన ఎన్నికల్లో 354 సీట్లను గెలుచుకుని అధికార పగ్గాలను చేతబట్టారు. ఇందిరాపై అసంతృప్తి కారణంగా ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వం.. ఇందిరా తిరిగి అధికారంలోకి రావడానికి అదే ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ ఎన్నికల ప్రచారం 63 రోజులు కొనసాగగా.. 62 ఏండ్ల వయసులో ఇందిరాగాంధీ రోజుకు 20 ప్రసంగాలు చేసి మొత్తం 40 వేల కిలోమీటర్లు సందర్శించి కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో ఇందిరమ్మ ఘనవిజయం సాధించేందుకు.. ఊచకోత జరిగిన పాట్నా సమీపంలోని బెల్చీ గ్రామాన్ని సందర్శించేందుకు ఏనుగుపై కూర్చుండి వెళ్లడం ఉపయోగపడిందని రాజకీయ నిపుణులు చెప్తుంటారు.
అమెరికాలో మొదటి ఎన్నికలు
అమెరికాలో 1789 లో ఇదే రోజున మొదటి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే.. ఎవరికైతే ఆస్తి ఉంటుందో వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం. జార్జ్ వాషింగ్టన్ మొదటి ఎన్నికలలో గెలిచి.. 1789 ఏప్రిల్ 30 న తొలి అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించారు. ఆనాటి నుంచి మొన్నటి వరకు జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు అదే ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థలో జరుగుతుండటం విశేషం.
ఈ రోజు ముఖ్య సంఘటనలు:
2017: పోర్చుగీస్ మాజీ అధ్యక్షుడు మారియో సోరెస్ కన్నుమూశారు.
2015: పారిస్‌లోని చార్లీ అబ్డో కార్యాలయంపై ఇద్దరు ముష్కరులు దాడి చేసిన ఘటనలో 12 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.
2009: ఐటీ కంపెనీ సత్యం చైర్మన్ రామలింగం రాజు తన పదవికి రాజీనామా చేశారు.
2003: అభివృద్ధి పనుల కోసం భారతదేశానికి 90 మిలియన్ డాలర్ల సహాయాన్ని జపాన్ ప్రకటించింది.
2000: జకార్తా (ఇండోనేషియా) లోని వేలాది మంది ముస్లింలు మొలుకాస్ దీవులలో క్రైస్తవులకు వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించారు.
1999: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై అభిశంసన చర్య ప్రారంభమైంది.
1989: జపాన్ చక్రవర్తి హిరోహిటో మరణం, కొత్త చక్రవర్తిగా అకిహిటోను ప్రకటించారు.
1987: టెస్ట్ క్రికెట్లో హర్యానా హరికేన్ కపిల్‌దేవ్ 300 వికెట్లు తీసిన ఘనత సాధించారు.
1972: స్పెయిన్‌లోని ఐబిజా ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది సహా 108 మంది ప్రయాణికులు మరణించారు.
1959: క్యూబాలో ఫిడేల్ కాస్ట్రో కొత్త ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించింది.
1953: అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ హైడ్రోజన్ బాంబు తయారీని ప్రకటించారు.
1859: సిపాయి తిరుగుబాటు కేసులో మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ (II) పై విచారణ ప్రారంభమైంది.
1761: ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠాలను ఓడించాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్‌లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్