శనివారం 30 మే 2020
International - May 14, 2020 , 14:02:31

'పోతిరెడ్డిపాడు' పాపం కేంద్ర ప్రభుత్వానిదే

'పోతిరెడ్డిపాడు' పాపం కేంద్ర ప్రభుత్వానిదే

హైదరాబాద్ : పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా జలాలు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును లండన్ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం  ఖండించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం సరైన నిర్ణయం కాదన్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే టీఆర్ఎస్ పార్టీ ఉపేక్షిందన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం లో ఎలాగైతే ద్వంద వైఖరిని అవలంబించిందో, నేడు కృష్ణా జలాల వివాదంపై కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నాయకులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని  అనిల్  ఫైర్‌ అయ్యారు. నాడు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని, అలాగే తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ పిలుపిస్తే ఏ పోరాటానికైనా ఎన్నారై తెరాస సిద్ధంగా ఉందని  ఆయన తెలిపారు.


logo