ఆదివారం 17 జనవరి 2021
International - Dec 31, 2020 , 01:53:30

టీకా వేసుకొన్నాపాజిటివ్‌!

టీకా వేసుకొన్నాపాజిటివ్‌!

అమెరికాలో ఓ నర్సుకు వింత అనుభవం

అనూహ్యమేమీ కాదు 14 రోజుల తర్వాతే రక్షణ: వైద్య నిపుణులు

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పురుష నర్సు మాథ్యూ ఈ నెల 18న ఫైజర్‌ టీకా వేసుకొన్నారు. తాజాగా ఆయన కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో టీకాపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది అనూహ్యమైనదేమీ కాదని వైద్య నిపుణులు తెలిపారు. టీకా వేసుకొన్న 14 రోజుల తర్వాతే శరీరంలో కొవిడ్‌ ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని చెప్పారు. మొదటి డోస్‌ వేసుకొన్నప్పుడు 50 శాతం, రెండో డోస్‌ తర్వాత 95 శాతం రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. మాథ్యూ కరోనా టీకా వేసుకొన్న తర్వాత కొవిడ్‌ యూనిట్‌లో విధులు నిర్వహించారు. క్రిస్మస్‌ రోజున అనారోగ్యానికి గురయ్యారు.