వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో ఓ స్థానిక వార్తాఛానల్లో పోర్న్ వీడియో ప్రసారం కావడంతో వీక్షకులు షాక్కు గురయ్యారు. క్రెమ్2 అనే న్యూస్ ఛానల్లో గత ఆదివారం సాయంత్రం 6 గంటల బులెటిన్లో 13 సెకన్లపాటు ఈ వీడియో ప్రసారమైంది. ఆ సమయంలో న్యూస్ యాంకర్ వాతావరణ వివరాలు చెబుతున్నారు. అయితే వెనుక తెరపై పోర్న్ వీడియో ప్రసారమైంది. ఈ విషయాన్ని ఆమె గుర్తించలేదు. చివరకు ఆ ఛానల్ తమ తప్పును గుర్తించి.. వీక్షకులకు క్షమాపణలు చెప్పింది.