మంగళవారం 26 మే 2020
International - Apr 12, 2020 , 10:26:13

భ‌యానికి లొంగిపోవ‌ద్దు.. పోప్ సందేశం

భ‌యానికి లొంగిపోవ‌ద్దు.. పోప్ సందేశం

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు భ‌యానికి లొంగిపోవ‌ద్దు అని పోప్ ఫ్రాన్సిస్ సందేశ‌మిచ్చారు. ఈస్ట‌ర్ విజిల్ స‌ర్వీస్ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఆయ‌న ఇట‌లీలోని సెయింట్ పీట‌ర్స్ బాసిలికాలో మాట్లాడారు. మృత్యువు క‌రాళ‌నృత్యం చేస్తున్న వేళ‌.. జీవిత సందేశక‌ర్త‌లుగా ఉండాల‌ని పోప్ పిలుపునిచ్చారు. పోప్ సందేశాన్ని సుమారు 1.3 బిలియ‌న్ల క్యాథ‌లిక్ క్రైస్త‌వులు లైవ్ స్ట్రీమ్‌లో వీక్షించారు. ఇట‌లీలో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న కార‌ణంగా.. పోప్ సందేశానికి ప్ర‌జ‌లు ఎవ‌రూ ప్ర‌త్య‌క్షంగా హాజ‌రుకాలేదు. పోప్ బాధ్య‌తాయుత సందేశాన్ని ఇచ్చార‌ని ప్ర‌ధాని గుసెప్పి కాంటె తెలిపారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రైస్త‌వులు ఈస్ట‌ర్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. కానీ క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో భ‌క్తులు ఎవ‌రూ లేకుండానే చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు.


  logo