శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 04, 2020 , 01:07:20

పోప్‌కు సోక లేదు!

పోప్‌కు సోక లేదు!
  • కరోనా పరీక్షల్లో నెగెటివ్‌

వాటికన్‌ సిటీ: జలుబుతో బాధపడుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌కు కరోనా వైరస్‌ సోకలేదని, పరీక్షల్లో నెగెటివ్‌ అని వచ్చిందని ఇటలీకి చెందిన ఓ పత్రిక మంగళవారం వెల్లడించింది. పోప్‌  అన్ని బహిరంగ సమావేశాలను ఉపసంహరించుకోవడమేగాక, తన పదవీకాలంలో తొలిసారిగా ఉపవాస విందును కూడా రద్దుచేసుకున్నారు. దీంతో ఆయన కరోనాతో బాధపడుతున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే పోప్‌కు నిర్ధారణ పరీక్ష ఎప్పుడు జరిగిందనే విషయమై వార్తాకథనంలో వెల్లడించలేదు. 


logo