గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 20:39:49

గందర‌గోళంలో పోలిష్ అధ్య‌క్ష ఎన్నిక‌...

గందర‌గోళంలో పోలిష్ అధ్య‌క్ష ఎన్నిక‌...

వార్సా: వ‌చ్చే నాలుగు రోజుల్లో పోలాండ్ పోలిష్  అధ్య‌క్ష ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మే 10వ తేదీన‌ ఆదివారం పోలింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా అది జ‌రుగుతుందో లేదో తెలియ‌డం లేదు. ఎందుకంటే క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో అధ్య‌క్ష ఎన్నిక గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు చ‌ట్టం చేయాల‌ని గ‌తంలోనే పార్ల‌మెంట్‌లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అది ఇంకా చ‌ట్ట‌స‌భ‌లో పాస్ కాలేదు. అయితే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేదు, కాని ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఎన్నిక‌ను వాయిదా వేయ‌లేద‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. 


logo