e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లుపై పోలీసుల విచార‌ణ‌

ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లుపై పోలీసుల విచార‌ణ‌

ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లుపై పోలీసుల విచార‌ణ‌

హెల్సీన్కీ: ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని స‌న్నా మారిన్ బ్రేక్‌ఫాస్ట్ ఖ‌ర్చు నెల‌కు 365 డాల‌ర్లు అవుతున్న‌ది. అంత భారీ స్థాయిలో అల్పాహార బిల్లు కావ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌న్నుదారుల సోమ్మును దుర్వినియోగం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాని మారిన్ ఫ్యామిలీకి బ్రేక్‌ఫాస్ట్ బిల్లు అంత రావ‌డం ఏంట‌న్న అనుమానాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఫిన్‌ల్యాండ్ పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. అధికారిక నివాసం కెస‌రాంటాలో ఉంటున్న ప్ర‌ధాని మారిన్‌.. ప్ర‌తి నెల త‌న బ్రేక్‌ఫాస్ట్ బిల్లును 365 డాల‌ర్లుగా చూపిస్తున్నారు. ప‌న్నుల‌దారుల సొమ్మును అక్ర‌మ‌రీతిలో స‌బ్సిడీకి వాడుతున్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. దీనిపై మారిన్ స్పందిస్తూ గ‌తంలోనూ ఇలా బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఇచ్చేవార‌న్నారు. కానీ ఓ ప్ర‌ధానిగా తానేమీ ఈ నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ఇక నుంచి బ్రేక్‌ఫాస్ట్ కు అయ్యే ఖ‌ర్చును సొంతంగా భ‌రించ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. ఫిన్‌ల్యాండ్ చ‌ట్టాల ప్ర‌కారం ప‌న్నుదారుల ఆదాయాన్ని అక్ర‌మ రీతిలో వినియోగించ‌డం నేర‌మ‌ని నిపుణులు అంటున్నారు. ప్ర‌ధాని ఆఫీసులో ఉన్న అధికారుల‌తో అల్పాహార బిల్లు అంశంలో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లుపై పోలీసుల విచార‌ణ‌

ట్రెండింగ్‌

Advertisement