శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 26, 2020 , 17:30:23

పోలీస్‌యూనిఫాంలో కుక్క.. భలే ఫోజిచ్చింది..!

పోలీస్‌యూనిఫాంలో కుక్క.. భలే ఫోజిచ్చింది..!

వాషింగ్టన్‌: పోలీస్‌యూనిఫాంలో కుక్క ఫోజివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. పోలీస్‌శాఖలో ఇటీవల నియామకమైన ఓ జాగిలం అచ్చం అధికారుల్లాగా యూనిఫాం వేసుకొని స్టిల్‌ ఇచ్చిందట. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ కుక్క పోలీస్‌ ఆఫీసర్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

ఫ్లోరిడాలోని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఈ జాగిలం నియామకమైంది. దీని పేరు చికో. ఇది ఎన్‌ఫోర్సర్‌ యూనిఫాం, బ్యాడ్జీ, టై ధరించిమరీ ఫొటోకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలను ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.‘కే -9 చికో ఈ రోజు తన కొత్త ఐడీ బ్యాడ్జ్ కోసం ఫోజులిచ్చాడు. ఫొటో కోసం టై కూడా ధరించాడు.’అని క్యాప్షన్‌ ఇచ్చారు ఈ ఫొటోలను 9,200 మంది షేర్‌ చేశారు. 6,000మంది లైక్‌ చేయగా, 1,400మంది కామెంట్‌ చేశారు.