శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 01:49:40

నల్లజాతీయుల హాహాకారాలు

నల్లజాతీయుల హాహాకారాలు

  • అమెరికాలో వారిపై ఆగని దాష్టీకాలు
  • మతిస్థిమితంలేని వ్యక్తిపై పోలీసుల దాడి
  • చనిపోయిన డేనియల్‌ ప్రూడ్‌.. ఆలస్యంగా వెలుగులోకి

రోచెస్టర్‌/లాస్‌ ఏంజెల్స్‌, సెప్టెంబర్‌ 3: అమెరికాలో జాతివివక్ష అమానుషాలు కొనసాగుతూనే ఉన్నా యి. మతిస్థిమితంలేని ఓ నల్లజాతీయుడిని పోలీసులు దారుణంగా హింసించి అతడి చావుకు కారణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో  మార్చిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియోను మృతుడి కుటుంబసభ్యులు బయటపెట్టారు. వీడియో రికార్డు ప్రకారం డేనియల్‌ ప్రూడ్‌ (41) అనే నల్లజాతీయుడు ఒంటిపై బట్టలు లేకుండా రోడ్డుపై పరుగెడుతున్నాడు. దాదాపు పదిమంది పోలీసులు ప్రూడ్‌ను రోడ్డుపై పడేసి మాస్కులాంటి ముసుగును అతడి తలకు బిగించారు. ఊపరాడని ప్రూడ్‌ నిమిషాల వ్యవధిలోనే చలనంలేకుండా పడిపోయాడు. చికిత్స పొందుతూ మార్చి 30న మరణించాడు. ఇదిలా ఉండగా దక్షిణ లాస్‌ ఏంజెలెస్‌లో సైకిల్‌పై వెళ్తున్న 29 ఏండ్ల డిజోన్‌ కిజ్జీ అనే నల్లజాతి యువకున్ని పోలీసులు సోమవారం కాల్చిచంపారు. సైకిల్‌పై వెళ్తున్న కిజ్జీ ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద పట్టుతప్పి రోడ్డుపై పడిపోయాడు. అతడు పైకి లేసేందుకు ప్రయత్నిస్తుండగానే పోలీసులు అతడిపై కాల్పులు జరుపటంతో మరణించాడు. 


logo