శుక్రవారం 10 జూలై 2020
International - Jun 02, 2020 , 09:40:36

ఆర్మేనియా ప్రధానికి కరోనా..మోదీ పరామర్శ

ఆర్మేనియా ప్రధానికి కరోనా..మోదీ పరామర్శ

న్యూఢిల్లీ: ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్‌ పషినియాన్‌కు కరోనా వైరస్‌ సోకింది. పరీక్షలో తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని స్వయంగా నికోల్‌ ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకినట్లు చెప్పారు.  సుమారు 30 లక్షల జనాభా ఉండే ఆర్మేనియాలో ఇప్పటి వరకు 9వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా 130 మందికి పైగా మరణించారు. 

 కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో భారత్.. అర్మేనియాకు అండగా  నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని నికోల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.  logo