ఆదివారం 17 జనవరి 2021
International - Dec 17, 2020 , 08:52:56

నేడు భారత్‌, బంగ్లా ప్రధానుల భేటీ

నేడు భారత్‌, బంగ్లా ప్రధానుల భేటీ

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో భేటీకాననున్నారు. వర్చువల్‌ విధానంవిధానంలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా నేతలిద్దరు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. వివిధ రంగాల్లో పరస్పర సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. కొవిడ్‌ అనంత‌రం రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునే అంశంపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ భేటీకి సంబంధించిన స‌మాచారాన్ని భార‌త విదేశాంగ శాఖ వెల్లడించింది. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పడడానికి దారితీసిన పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన విజయ్ దివస్‌ తర్వాత ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో రవాణా, కనెక్టివిటీని పెంచడానికి భారత్, బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తున్నాయని విదేశాంగ వర్గాలు తెలిపాయి. సమావేశంలో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య 1965కి ముందు ఉన్న ఆరు రైలు సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరుదేశాల ప్రధానులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్‌పై చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.