బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 26, 2020 , 02:22:44

భారత్‌-బ్రెజిల్‌ భాయీ భాయీ

భారత్‌-బ్రెజిల్‌ భాయీ భాయీ
  • బ్రెజిల్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
  • ఇరుదేశాల మధ్య సరికొత్త అధ్యాయానికి నాంది: మోదీ
  • రెండుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై యాక్షన్‌ ప్లాన్‌
  • 15 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: భారత్‌-బ్రెజిల్‌ మధ్య తాజాగా 15 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని నరేంద్రమోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియస్‌ బోల్సోనారో శనివారం ఢిల్లీలో సమావేశమమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. సంప్రదాయ ఔషధాలు, పశుపోషణ, చమురు, ఖనిజలవణాలు, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాలకు సంబంధించిన 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీంతోపాటు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసేదిశగా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌర విమానయాన, ఇంధన, ఆరోగ్య, పర్యావరణం తదితర రంగాల్లో బంధాలను మరింత బలోపేతం చేసేందుకు లక్ష్యాలను విధించుకున్నారు. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈమేరకు మోదీ మాట్లాడుతూ.. ‘మీ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారోను కొనియాడారు. బోల్సోనారో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ఇప్పటికే దృఢమైన బంధాలు ఉన్నాయని, తాజాగా కుదిరిన 15 ఒప్పందాలతో మరిన్ని రంగాల్లో సహకారాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ఆదివారం జరుగనున్న గణతంత్ర వేడుకలకు  బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  


దృఢమైన బంధం 

భారత్‌-బ్రెజిల్‌ మధ్య కొన్నేండ్లుగా బలమైన బంధాలు కొనసాగుతున్నాయి. 2018-19 మధ్య రెండు దేశాల మధ్య దాదాపు రూ.58 వేల కోట్ల (8.2 బిలియన్‌ డాలర్లు) వ్యాపారం జరిగింది. 
logo
>>>>>>