మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 09:37:41

మోదీ నాకు మంచి మిత్రుడు: ట‌్రంప్‌

మోదీ నాకు మంచి మిత్రుడు: ట‌్రంప్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌.. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ .. భార‌తీయ ఓట‌ర్ల‌ను అట్రాక్ట్ చేసే ప‌నిలో ప‌డ్డారు.  ప్ర‌ధాని మోదీ త‌న‌కు మంచి మిత్రుడు అని, ఇండియన్ అమెరిక‌న్ ఓట‌ర్లు త‌న‌కే ఓటు వేస్తార‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  ట్రంప్ రెండ‌వ సారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీప‌డుతున్న విష‌‌యం తెలిసిందే.  భార‌త్ నుంచి త‌మ‌కు మంచి స‌పోర్ట్ ఉంద‌ని,  ప్ర‌ధాని మోదీ నుంచి కూడా మంచి మ‌ద్ద‌తు ఉంద‌ని, అమెరికాలో స్థిర‌ప‌డిన భార‌తీయులు త‌న‌కు ఓటు వేస్తార‌ని న‌మ్మ‌కం ఉంద‌న్నారు.  వైట్‌హౌజ్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.   

ప్ర‌ధాని మోదీతో త‌న‌కు మంచి రిలేష‌న్ ఉంద‌ని, ఆయ‌న నాకు స్నేహితుడని, మోదీ మంచి ప‌నులు చేస్తున్నార‌ని, గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో హూస్ట‌న్‌లో జ‌రిగిన హౌడీ మోదీ స‌భ‌ను ట్రంప్ గుర్తు చేశారు.  హూస్ట‌న్‌లో తాము ఓ ఈవెంట్‌లో పాల్గొన్నామ‌ని, అదో అద్భ‌తమ‌ని, ప్ర‌ధాని మోదీ త‌న‌ను ఆహ్వానించార‌ని, భారీ స‌భ జ‌రిగింద‌ని, అది అమోఘ‌మ‌ని, ప్ర‌ధాని మోదీ గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి అని,  ఇండియా నుంచి మంచి స‌పోర్ట్ ఉంద‌ని,  మోదీ నుంచి కూడా మంచి మ‌ద్ద‌తు ఉంద‌ని ట్రంప్ తెలిపారు.  మీకు తెలుసు, మ‌హ‌మ్మారికి ముందే నేను ఇండియాకు వెళ్లాను.. అక్క‌డ ప్ర‌జ‌లు చాలా మంచి వాళ్లు అని, అదో అద్భుత ప్ర‌దేశ‌మ‌ని, అద్భుత‌మైన దేశ‌మ‌ని, చాలా పెద్ద దేశ‌మ‌ని ట్రంప్ అన్నారు.  భార‌త్‌కు గొప్ప నాయ‌కుడు ఉన్నార‌ని, మోదీ ఓ గొప్ప వ్య‌క్తి అని ట్రంప్ తెలిపారు. 
logo