బోరిస్ జాన్సన్ ఇండియా వెళ్తున్నారు : యూకే మంత్రి

హైదరాబాద్: భారత గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రానున్నారు. ఈ విషయాన్ని యూకే కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల శాఖా మంత్రి తారిక్ అహ్మద్ ద్రువీకరించారు. జనవరి 26వ తేదీన జరగనున్న భారత ఆర్డీ పరేడ్‌లో బోరిస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఇండియాతో బలమైన మైత్రిని కోరుకుంటున్నామని తారిక్ తన ట్వీట్లో తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా భారత్‌తో బంధాన్ని ద్రుడపరచనున్నట్లు వెల్లడించారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా టూర్‌కు రాకపోవచ్చు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో మంత్రి తారిక్ పోస్టు చేసిన ట్వీట్ ఆ సందేహాలను నివృత్తి చేసింది. నవంబర్ 27వ తేదీన ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. గణతంత్య్ర వేడుకలకు అతిథిగా హాజరుకావాలంటూ బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి
కశ్మీర్లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ
600 డాలర్లు కాదు.. ఒక్కొక్కరికి 2వేల డాలర్లు ఇవ్వండి
రాహుల్‌గాంధీకి ఆలుగడ్డ ఎట్ల పెరుగుతదో తెలియదు: బీజేపీ
తాజావార్తలు
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి