శుక్రవారం 10 జూలై 2020
International - May 28, 2020 , 13:08:00

మా ఉద్యోగుల్ని వ‌దిలేయండి.. నేనే బాధ్యుడిని

మా ఉద్యోగుల్ని వ‌దిలేయండి.. నేనే బాధ్యుడిని

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ల‌కు .. సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సంస్థ వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.  గ్రీన్‌మార్క్‌తో ఫ్యాక్ట్ చెక్ లేబుల్‌ను అంటించ‌డంతో ట్విట్ట‌ర్ సంస్థ‌పై ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  అమెరికా ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ జోక్యం చేసుకుంటున్న‌ట్లు ఆరోపించారు.  అవ‌స‌ర‌మైతే ఆ సంస్థ‌నే మూసివేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీ స్పందించారు.  ఈ విష‌యంలో త‌మ ఉద్యోగుల‌ను వ‌దిలి వేయాలంటూ జాక్ డోర్సీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.  ట్రంప్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్‌లో డోర్సీ త‌మ కంపెనీ విధానం గురించి వెల్ల‌డించారు.  ఫ్యాక్ట్ చెక్ ప‌ద్ధ‌తికి ఎవ‌రో ఒక‌రు బాధ్య‌త వ‌హించాల‌ని, కానీ ఆ కంపెనీ త‌న‌దే కాబ‌ట్టి, ఆ బాధ్య‌త తానే తీసుకుంటాన‌న్నాడు.  మా ఉద్యోగుల‌ను మాత్రం ఏమీ చేయ‌కండి అంటూ డోర్సీ త‌న ట్వీట్‌లో కోరారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల విష‌యంలో అసంబ‌ద్ధ‌మైన‌, వివాదాస్ప‌ద‌మైన స‌మాచారం ఉన్న ట్వీట్ల‌కు ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేస్తామ‌న్నారు. ఏవైనా త‌ప్పులు చేస్తే వాటిని అంగీక‌రిస్తామ‌న్నారు.


logo