ఆదివారం 29 మార్చి 2020
International - Mar 10, 2020 , 02:09:31

గేమ్స్‌తో తగ్గుతున్న భోజనం!

గేమ్స్‌తో తగ్గుతున్న భోజనం!

వాషింగ్టన్‌: కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతూ భోజనం చేయడం వల్ల తక్కువ పరిమాణంలో ఆహారం తింటారని ఓ సర్వే తేల్చింది. 119 మంది యువకులపై ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సర్వే జరిపారు. ఎటువంటి అంతరాయం లేకుండా భోజనం చేసినప్పటితో పోలిస్తే 15 నిమిషాలు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతూ భోజనం చేసినప్పుడు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారని తేలింది. ఇది అల్జీమర్స్‌ వ్యాధి, శ్రద్ధ లోప వైకల్యం వంటి సమస్యలకు దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు. కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతూ భోజనం చేయడం వల్ల పరధ్యానంలో ఉంటూ తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు గుర్తించామని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన కార్లీ ఏ లిగౌరి చెప్పారు. 
logo