ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 21:41:41

నాలుగు ఆకుల మొక్క 4 లక్షలకు అమ్ముడుపోయింది..!

నాలుగు ఆకుల మొక్క 4 లక్షలకు అమ్ముడుపోయింది..!

వెల్లింగ్టన్‌: కేవలం నాలుగు ఆకులున్న ఓ మొక్క 4,000 డాలర్లకు అంటే అక్షరాలా రూ. నాలుగు లక్షలకు అమ్ముడుపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ మొక్క రంగురంగుల రాఫిడోఫోరా టెట్రాస్పెర్మా లేదా ఫిలోడెండ్రాన్ మినిమా. సగం ఆకుపచ్చ, సగం పసుపు ఆకులతో ఉన్న ఈ మొక్క చాలా అరుదుగా లభిస్తుందట. అందుకే దానికంత డిమాండ్‌. 

ప్రత్యేకతలుగల ఈ మొక్కను న్యూజిలాండ్ ట్రేడింగ్ సైట్ ట్రేడ్ మిలో వేలం వేశారు. రూ. 4.02 లక్షలు బిడ్‌ వేసినవారు దీన్ని గెలుచుకున్నారు. ఇంతవరకూ ఒక మొక్కకు వచ్చి గరిష్ట ధర ఇదేనట. ఇది ‘ఉష్ణమండల స్వర్గం’ అని దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి అభివర్ణించాడు. తాము ఉష్ణమండల ఉద్యానవనాన్ని నిర్మిస్తున్నామని, అందుకోసమే దీన్ని అంత ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఇది ఒక పక్షి, సీతాకోక చిలుకకు ఆవాసంగా మారబోతున్నదని, అప్పుడు ఈ మొక్కను చూడడానికి మీ రెండు కళ్లూ చాలవని అతడు పేర్కొన్నాడు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo