సోమవారం 06 జూలై 2020
International - Jun 18, 2020 , 08:30:56

బీజింగ్‌కు విమానాలు, రైళ్లు రద్దు

బీజింగ్‌కు విమానాలు, రైళ్లు రద్దు

బీజింగ్‌: రాజధాని బీజింగ్‌లో కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమైంది. తాజాగా 31 కొత్త కేసులతో మొత్తం 137 మందికి పాజిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో యుద్ధప్రాతిపదికన వైరస్‌ నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశీయంగా బీజింగ్‌కు వచ్చి వెళ్లే విమాన, రైలు సర్వీసులను రద్దు చేసింది. బీజింగ్‌ పరిధిలోని రెండు విమానాశ్రయాల్లో 1,255 దేశీయ విమాన సర్వీసులను అంటే 40 శాతానికిపైగా విమానాలను రద్దు చేసినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం బీజింగ్‌ నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడువడం లేదు. మరోవైపు 90 వేల మందికి వైద్య పరీక్షలు చేపట్టాలని బీజింగ్‌ నిర్ణయించింది.


logo