మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 17:33:09

ఆ రెస్టారెంట్‌లో వ‌ర్చువ‌ల్ వెయిట‌ర్‌.. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకే!

ఆ రెస్టారెంట్‌లో వ‌ర్చువ‌ల్ వెయిట‌ర్‌.. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకే!

క‌రోనా నేప‌థ్యంలో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఆహారం త‌యారు చేస్తారేమో అని వెళ్ల‌డం కూడా మానేస్తున్నారు. ఇప్పుడు అలాంటి భ‌యం పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. గ్లౌజులు, మాస్కులు, శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించిన త‌ర్వాతే వంట చేయ‌డం మొద‌లుపెడుతున్నారు. దీంతోపాటు ఏం కావాలంటూ వెయిట‌ర్ కూడా క‌స్ట‌మ‌ర్ ద‌గ్గ‌ర‌కు రాడు. అంతా వ‌ర్చువ‌ల్‌గానే జ‌రుగుతుంది. స్కూల్‌కు వెళ్ల‌ని పిల్ల‌ల‌కు ఆన్‌లైన్‌లో ఎలా అయితే క్లాసులు చెబుతున్నారో. అచ్చం అలానే మెనూ ఆర్డ‌ర్ ఇస్తున్నారు.

స్పెయిన్ రెస్టారెంట్‌లో ఈ ప‌ద్ధ‌తి స్టార్ట్ చేశారు. పర్యాటకులకు ప్రాచుర్యం పొందిన కోస్టా బ్రావాలోని పాలాఫ్రుగెల్‌లోని ఫంకీ పిజ్జా వద్ద వినియోగ‌దారులు త‌న ఫోన్‌ల‌లోని ఫంకీ పే అనువ‌ర్త‌నం ద్వారా మెనూ బ్రౌజ్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆర్డ్‌ర్ ఇవ్వొచ్చు. దీనివల్ల వెయిట‌ర్‌తో క‌మ్యునికేష‌న్‌ను కోల్పోతామ‌ని క‌స్ట‌మ‌ర్లు బాధ‌ప‌డుతున్నారు. కానీ ఈ టైంలో ఇదే స‌రైన‌ది కూడా అంటున్నారు. 


logo