మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 18:28:24

ఈ జంతువులు పెయింటింగ్‌ కూడా వేయగలవ్‌..!

ఈ జంతువులు పెయింటింగ్‌ కూడా వేయగలవ్‌..!

న్యూయార్క్‌: పెయింటింగ్స్‌ కేవలం మనుషులు మాత్రమే వేయగలరనకుంటే ఇక మీరు రంగులో కాలేసినట్లే. ఎందుకంటే అమెరికాలో ఓ జాతికి చెందిన జంతువులు అద్భుతమైక కళాఖండాలు గీస్తూ అబ్బురపరుస్తున్నాయి. రకూన్స్‌ (నక్కను పోలిన క్షీరదం) కాన్వాస్‌పై వాటర్‌ కలర్స్‌తో వేస్తున్న పెయింటింగ్స్‌ ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

పైపర్‌, టిటో, చీటో అనే మూడు రకూన్స్‌ను దక్షిణ కరోలినాలోని మిచెల్, సారా థైమ్‌ పెంచుకుంటున్నారు. వీటికి శిక్షణ ఇవ్వగా, అద్భుతమై బొమ్మలు గీస్తున్నాయి.  దీంతో ఈ జంట ఇప్పుడు పైపర్, టిటో, చీటో వేసిన పెయింటింగ్స్‌ను ‘పావ్‌ట్రెయిట్స్‌’ పేరుతో అమ్మడం ప్రారంభించింది. ప్రతి కళాకృతికి వారు 75 నుంచి 100 డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ పావ్‌ట్రైయిట్స్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo