బుధవారం 03 జూన్ 2020
International - Apr 02, 2020 , 12:47:12

కరోనా, కరోనా అని అరిచినందుకు భారతీయునికి జైలు

కరోనా, కరోనా అని అరిచినందుకు భారతీయునికి జైలు

హైదరాబాద్: సింగపూర్ కరోనా నిబంధనలను కటినంగా అమలు చేస్తున్నది. ఆ సంగతి తెలియక కొంచెం శ్రుతిమించి ప్రవర్తించిన భారతీయుడు ఊచలు లెక్కిస్తున్నాడు. చాంగీ ఎయిర్‌పోర్టు హోటల్ లో జస్విందర్‌సింగ్ మెహర్‌సింగ్ (52) ఏదో వెర్రి లేచినట్టుగా ఒక్కసారిగా కరోనా, కరోనా అని  కేకలు వేశాడు. అంతేకాకుండా హోటల్ ఫ్లోరింగ్ మీద ఎడాపెడా ఉమ్మేశాడు. అసలే సింగపూర్. పైగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యం. ఇంకేముంది? సింగ్‌ను పట్టుకుని రెణ్ణెళ్ల జైలుశిక్ష వేశారు. ఇంతకూ మన సింగ్ వింత ప్రవర్తనకు కారణం తెలుసా? ఆకలితో నకనకలాడుతూ ఏదైనా తిందామని  రెస్టారెంట్‌కు వెళితే అప్పటికే కట్టేశామని చెప్పారట. దాంతో ఒళ్లుమండిపోయి మనవాడు ఖాళీ ప్లేట్లను, టేబుళ్లను చిందరవందర చేశాడు. అంతటితో ఊరుకోకుండా నేల మీద ఉమ్మేయడం, కరోనా కరోనా అని గావు కేకలు పెట్టడంతో పోలీసులను పిలిపించారు. సింగ్ మీద పాత కేసులు కూడా ఉన్నాయట.


logo