గురువారం 09 జూలై 2020
International - Jun 20, 2020 , 00:50:02

కండ్లకలకా కరోనా లక్షణమే!

కండ్లకలకా కరోనా లక్షణమే!

టొరంటో: కండ్లకలక కూడా కరోనా లక్షణమే అని పరిశోధకులు గుర్తించారు. కండ్లకలకతో మార్చిలో ఓ మహిళ టొరంటోలోని ఓ దవాఖానలో చేరారు. చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం కలుగలేదు. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. దగ్గు, జ్వరం లక్షణాలు లేకపోవడంతో కొవిడ్‌-19 అన్న సందేహం తమకు రాలేదని ఆల్బెర్టా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కార్లోస్‌ తెలిపారు. 10-15 శాతం కరోనా కేసుల్లో కండ్లకలక అన్నది ద్వితీయ లక్షణంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 


logo