బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 15:23:07

3,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న గుర్తుతెలియని మనిషి.. పైలెట్స్‌ షాక్‌..!

3,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న గుర్తుతెలియని మనిషి.. పైలెట్స్‌ షాక్‌..!

కాలిఫోర్నియా: విమానం గాల్లో 3,000 అడుగుల ఎత్తులో వెళ్తున్నది. సడెన్‌గా దాని పక్కనే జెట్‌ప్యాక్‌లో ఓ గుర్తు తెలియని మనిషి ప్రత్యక్షమయ్యాడు. దీంతో పైలెట్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు తెలియజేశాడు. ఒకరిని కాదు ఇద్దరు పైలెట్లనూ ఆ మనిషి ఆందోళనకు గురిచేశాడు. సైన్స్‌ ఫిక్షన్‌, యాక్షన్‌ సినిమాల తరహా ఈ సంఘటన యూఎస్‌లోని లాస్‌ఏంజిల్స్‌లో జరిగింది.   

లాస్ ఏంజిల్స్ ఎయిపోర్ట్ నుంచి 3,000 అడుగుల ఎత్తులో గుర్తు తెలియని వ్యక్తి జెట్‌ప్యాక్ ధరించి ఎగురుతున్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం పైలెట్‌ గుర్తించాడు. ‘టవర్, అమెరికన్ 1997. మేము జెట్‌ప్యాక్‌లో ఉన్న ఒక వ్యక్తిని చూశాం’ అని పైలట్ ఆడియో లాగ్‌లో చెప్పాడు. మూడు వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం ఎడమ వైపు నుంచి 300 గజాల దూరంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, మరో   పైలట్ కూడా 'జెట్‌ప్యాక్‌లో ఉన్న వ్యక్తిని' చూసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నివేదించాడు. వారు వెంటనే లాస్ ఏంజిల్స్‌లోని ఇతర విమానయాన సిబ్బందికి హెచ్చరిక పంపారు. ఈ దృశ్యాలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ఎఫ్‌బీఐ కూడా ఈ సంఘటనను గమనించింది. కాగా, ఆ వ్యక్తి తన ఆన్‌లైన్ ఫాలోవర్ల కోసం ఈ విన్యాసాలు చేస్తున్నాడని భావిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo