సోమవారం 01 మార్చి 2021
International - Jan 27, 2021 , 21:21:00

ఆకాశంలో ఎగిరే వస్తువును గుర్తించిన పైలట్‌

ఆకాశంలో ఎగిరే వస్తువును గుర్తించిన పైలట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన ఒక విమాన పైలట్‌ ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువును (యూఎఫ్‌వో) గుర్తించారు. ఈ నెల 23న పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని లాహోర్‌ నుంచి కరాచీకి నడుపుతుండగా రహిమ్‌ యార్‌ ఖాన్‌ ప్రాంతంపై గగనతలంలో ప్రకాశవంతమైన ఒక వస్తువు ఆయనకు కనిపించింది. ఈ విషయాన్ని ఆయన కంట్రోల్‌ రూమ్‌కు తెలిపారు. విమాన పైలట్‌తోపాటు రహిమ్‌ యార్‌ ఖాన్‌ ప్రాంత వాసులు కూడా దీనిని చూశారు. కొందరు తమ మొబైల్స్‌తో వీడియో కూడా తీశారు.

కాగా, ఈ నెల 23న సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహిమ్‌ యార్‌ ఖాన్‌ ప్రాంతంపై ఆకాశంలో భారీ సైజులో యూఎఫ్‌వోను గుర్తించడం చాలా అరుదని కొన్ని వర్గాలు తెలిపాయి. ఇది స్పేస్‌ స్టేషన్‌ లేదా శాటిలైట్‌ కావచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఏమిటన్నది ఖచ్చితంగా చెప్పలేమని, గుర్తు తెలియని ఎగిరే వస్తువును గుర్తించడంపై నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు రిపోర్టు చేసినట్లు వెల్లడించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo