శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 08:49:55

ఈ పావురం ధర రూ.14 కోట్లు!

ఈ పావురం ధర రూ.14 కోట్లు!

హైదరాబాద్‌: పావురానికి రూ.14 కోట్లేంటని ఆశ్చర్యపోతున్నారా..! అవును మీరు చదివింది నిజమే. దీనిని అమ్మకానికి పెడితే రూ.14 కోట్ల ధరపలికింది. ఈ ఖరీదైన పావురం పేరు ‘న్యూ కిమ్‌’. ‘పి‌జన్‌ ప్యార‌డైజ్‌’ ఆన్‌‌లై‌న్‌లో నిర్వహించిన వేలంలో ఇది రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు అమ్ముడుపోయింది. పావురాల పోటీలో పేరొందిన ఈ న్యూకిమ్‌ను చైనాకు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసు‌కు‌న్నారు.