ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 19:57:01

ఇంట‌ర్‌నెట్‌ను ఓ ఆట ఆడుకుంటున్న పెంగ్విన్ : వీడియో వైర‌ల్

ఇంట‌ర్‌నెట్‌ను ఓ ఆట ఆడుకుంటున్న పెంగ్విన్ :  వీడియో వైర‌ల్

ఖాళీగా ఉంటే ఎవ‌రికైనా బోర్ కొడుతుంది. పెంగ్విన్‌ల‌కు అయితే మ‌రీనూ. పియరీ అనే రాక్‌హాపర్ పెంగ్విన్ ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. అమెరికాలోని జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో ఈ పెంగ్విన్ ఒంట‌రిగా ఉండ‌డంతో  జూ సిబ్బంది దానిని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. అందుకు ఐపాడ్‌లో వీడియోలు ప్లే చేసి పెంగ్విన్‌కు చూపించారు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ పెంగ్విన్ చేసే వీడియోలు పెంగ్విన్ల‌కు సంబంధించిన‌వే. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న‌ది. అంతేకాదు రెక్క‌లు ఎగ‌రేస్తూ డ్యాన్స్ చేస్తున్న‌ది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే జంతువులు, ప‌క్షుల వీడియోలు నెటిజ‌న్ల‌ను బాగా అల‌రిస్తున్నాయి. 18 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.  


logo