బుధవారం 24 ఫిబ్రవరి 2021
International - Jan 15, 2021 , 16:20:38

పాకిస్థాన్‌ విమానాన్ని నిలువరించిన మలేషియా

పాకిస్థాన్‌ విమానాన్ని నిలువరించిన మలేషియా

కౌలాలంపూర్: పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు చెందిన ప్రయాణికుల విమానాన్ని మలేషియా నిలువరించింది. బ్రిటన్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు నేపథ్యంలో మలేషియాలోని స్థానిక కోర్టు ఆదేశాలతో పీఐఏకు చెందిన బోయింగ్‌ 777 విమానాన్ని టేకాఫ్‌ కాకుండా అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ శుక్రవారం తెలిపింది. ఇది ఆమోదయోగ్యంకాని చర్య అని పేర్కొంది. దౌత్య మార్గాల ద్వారా సమస్య పరిష్కారానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం మద్దతు కోరినట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. 

కాగా పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ), పెరిగ్రీన్ మధ్య చెల్లింపు వివాదంపై ఆరు నెలల కిందట యూకే కోర్టులో కేసు దాఖలైనట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ విమానాన్ని నిలువరించడంపై మలేషియా కోర్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని, దీంతో అప్పటికే విమానం ఎక్కిన ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని ఆయన చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo