శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 17:35:29

'అంత‌కు ముందు ఆ త‌ర్వాత‌'.. ఎక్క‌డప‌డితే అక్క‌డ పెయింటింగ్‌!

'అంత‌కు ముందు ఆ త‌ర్వాత‌'.. ఎక్క‌డప‌డితే అక్క‌డ పెయింటింగ్‌!

క‌నిపించే ప్ర‌తి వ‌స్తువు ఒక్కొక్క‌రికి ఒక్కో కోణంలో క‌నిపిస్తుంది. చంద‌మామ‌ను చూస్తే ఒక‌రికి చిన్నారి నిద్ర‌పోతున్న‌ట్లు క‌నిపిస్తే మ‌రొక‌రికి త‌ల్లి ఒడిలా అనిపిస్తుంది. ఇలా చూసే విధానంలో తేడా ఉంటుంది కానీ ఆ బొమ్మ‌, వ‌స్తువు మాత్రం ఎప్ప‌టికీ అలానే ఉంటుంది. ఎందుకూ ప‌నికిరాని చెత్త‌లో కూడా క‌ళాకారుల‌కు ఏదొక రూపం క‌నిపిస్తుంది. ముఖ్యంగా పోర్చుగ‌ల్‌లోని డ‌మైయాలో జ‌న్మించిన క‌ళాకారుడు సెర్గియో ఒడిత్‌ అయితే కంటికి క‌నిపించిన ప్ర‌తీదాన్ని ఆస‌క్తిక‌రంగా మార్చేస్తాడు. చెత్త‌కుప్ప‌లు, మురికి వాడ‌ల కార‌ణంగా పాడైన గోడ‌ల‌ను సైతం త‌న పెయింటింగ్‌తో మంచి రూపానికి తీసుకురాగ‌ల‌డు.

ఒక‌టేమిటి రెండేమిటి ఎన్నో చిత్రాల‌ను చిత్రించి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు.  అంత‌కు ముందు ఆ త‌ర్వాత అంటూ ఇన్‌స్టాలో ఇప్ప‌టికే సంచ‌ల‌నం సృష్టించాయి. ఇవి సృజనాత్మక కళాఖండాల కంటే తక్కువేం కాదంటున్నారు నెటిజ‌న్లు. కాంక్రీట్ స్తంభాల నుంచి గోపురాల వ‌ర‌కు ప్ర‌తీది నిజ‌జీవితంగా మార్చేస్తాడు. ఇత‌ను ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో పాల్గొన్నాడు. ఇత‌ని ప్ర‌తిభ‌ను చూడాల‌నుకుంటే ఓసారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి తొంగి చూడాల్సిందే..


View this post on Instagram

Classic day

A post shared by ODEITH (@odeith) on


View this post on Instagram

Classic day

A post shared by ODEITH (@odeith) on


logo