శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 07, 2020 , 21:03:53

ఆకాశంలోనే పక్షి పొట్ట చీల్చుకొని బయటకొచ్చిన స్నేక్‌ఈల్‌!

ఆకాశంలోనే పక్షి పొట్ట చీల్చుకొని బయటకొచ్చిన స్నేక్‌ఈల్‌!

న్యూయార్క్‌: ఆకాశంలో ఓ హెరాన్‌ (నారాయణపక్షి) ఎగురుతోంది. అది ప్రఖ్యాత వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కెమెరాకు చిక్కింది. ఇందులో వింతేముంది? అని అనుకుంటున్నారా? దాని పొట్టభాగం నుంచి ఓ స్నేక్‌ఈల్‌ వేలాడుతూ కనిపించింది. అంటే అది హెరాన్‌ను పట్టుకోలేదు. నారాయణపక్షి కడుపును చీల్చుకొని బయటకు వచ్చింది. రెండూ గాలిలో తేలియాడుతూ కనిపించాయి. 

అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన సామ్ డేవిస్ (58) అనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఈ నమ్మశక్యం కాని క్షణాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.  డేవిస్‌.. గద్దలు, నక్కల ఫొటోలు బంధించేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, ఆకాశంలో ఎగురుతున్న స్నేక్‌ ఈల్‌, హెరాన్‌ కనిపించగానే క్లిక్‌మనిపించాడు. మొదట స్నేక్‌ఈల్‌.. హెరాన్‌ మెడపట్టుకొని ఉందని అనుకున్నాడట. ఇంటికెళ్లి ఫొటోలు చూసి తనే షాకయ్యాడు. హెరాన్‌ పొట్ట చీల్చుకుని స్నేక్‌ హీల్‌ బయటకు వచ్చినట్లు గుర్తించాడు. అయినా హెరాన్‌ బతికే ఉందని తను చెబుతున్నాడు. ఇదిలా ఉండగా, ఇలాంటివి ఎప్పుడూ తాము చూడలేదని వన్యప్రాణి సిబ్బంది తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.