మనీలా : కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే అరెస్టు చేస్తామని ఫిలిఫిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే హెచ్చరించారు. ఆ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రోడ్రిగో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇలా మాట్లాడటం తప్పు అనుకోవద్దు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. మీరు ఒక వేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే.. తప్పకుండా అరెస్టు చేయాల్సి వస్తుందన్నారు. అప్పుడే తానే స్వయంగా వ్యాక్సిన్ ఇస్తానని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. అనవసరంగా తన దాకా వ్యాక్సినేషన్ ప్రక్రియను తీసుకురావొద్దు. వ్యాక్సినేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్పారు. ఒక వేళ వ్యాక్సిన్ తీసుకునే ఉద్దేశం లేకపోతే.. దేశాన్ని విడిచి ఇండియాకో, అమెరికాకో వెళ్లిపోండి అని అధ్యక్షుడు రోడ్రిగో అన్నారు.