బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 19, 2020 , 11:35:46

క్రిస్మ‌స్ లోపే ఫైజ‌ర్ టీకా పంపిణీ !

క్రిస్మ‌స్ లోపే ఫైజ‌ర్ టీకా పంపిణీ !

హైద‌రాబాద్:  అమెరికా కంపెనీ ఫైజ‌ర్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకా 95 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. బ‌యోఎన్‌టెక్ సీఈవో ఉగుర్ సాహిన్ దీనిపై ఓ కామెంట్ చేశారు.  యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబ‌ర్ రెండ‌వ వారంలో ఆమోదం ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగితే.. డిసెంబ‌ర్ మ‌ధ్య‌లో టీకాకు అనుమ‌తి ద‌క్కుతుంద‌ని,  క్రిస్మ‌స్ పండుగ లోపే డెలివ‌రీలు ప్రారంభం అవుతాయ‌ని ఉగుర్ సాహిన్ తెలిపారు. అమెరికా కంపెనీ ఫైజ‌ర్‌, జ‌ర్మ‌నీ భాగ‌స్వామి బ‌యోఎన్‌టెక్ సంయుక్తంగా కోవిడ్ టీకాను త‌యారు చేస్తున్నాయి.  మ‌హ‌మ్మారి అంతంలో ఈ టీకా అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని ఫైజ‌ర్ పేర్కొన్న‌ది.  

తమ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో 95 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని బుధవారం ఫైజ‌ర్‌ వెల్లడించింది. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన ఈ టీకా తుది ప్రయోగ ఫలితాలను ఫైజర్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల వారు, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని తెలిపింది. ఫైజర్‌ టీకాను మైనస్‌ 70 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది.