శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 01, 2020 , 21:22:01

చల్‌ జరుగు..: వధువును తన్నిన వరుడి కుక్క!వీడియో

చల్‌ జరుగు..: వధువును తన్నిన వరుడి కుక్క!వీడియో

అక్కడ రిసెప్షన్‌ జరుగుతోంది. వధువు..వరుడు పక్కపక్కనే నిల్చున్నారు. వరుడు తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నాడు. ఇంతలోనే వధువు దగ్గరికి వచ్చింది. ఆ పెంపుడు కుక్క ఏమనుకుందో ఏమోగానీ వధువును కాలితో తంతూ పక్కకు తోసేసింది. ఈ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఈ హాస్యభరితమైన సంఘటన తూర్పు చైనా నగరమైన జోజౌలో జరిగింది. వరుడి పెంపుడు కుక్క శాన్‌జియూ..వధువును తన్నగానే అక్కడున్నవారంతా నవ్వారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. హ్యాన్స్‌ సోలో అనే ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియో పోస్ట్‌ చేయగా, చాలామంది వీక్షించారు. పెద్ద సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.