గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 05, 2020 , 13:33:08

మనిషి నుంచి పెంపుడు కుక్కకు సోకిన కరోనా

మనిషి నుంచి పెంపుడు కుక్కకు సోకిన కరోనా

హాంగ్‌కాంగ్‌ : కరోనా వైరస్‌ మనిషి నుంచి పెంపుడు కుక్కకు సోకింది. హాంగ్‌కాంగ్‌లో 60 ఏళ్ల మహిళ కరోనా వైరస్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటుంది. ఆ వైరస్‌ మహిళ నుంచి శునకానికి సోకింది. దీంతో ఆ కుక్కను అగ్రికల్చర్‌, ఫిషరీస్‌ మరియు కన్జర్వేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న పెంపుడు జంతువులను గత శుక్రవారం నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్‌ చేశారు. ఇప్పటికే రెండు శునకాలు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నాయి. 


logo