e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home News విద్యుత్‌ వైర్‌కు చిక్కుకున్న పావురం.. డ్రోన్‌ సహాయంతో రెస్క్యూ

విద్యుత్‌ వైర్‌కు చిక్కుకున్న పావురం.. డ్రోన్‌ సహాయంతో రెస్క్యూ

లిమా: హై టెన్షన్‌ విద్యుత్‌ వైర్‌కు చిక్కుకున్న ఒక పావురాన్ని డ్రోన్‌ సహాయంతో కాపాడారు. పెరూలోని బరాంకాలో ఈ ఘటన జరిగింది. హై వోల్టేజీ సరఫరా అయ్యే విద్యుత్‌ వైర్‌కు చుట్టుకున్న దారానికి ఒక పావురం చిక్కుకుని 12 గంటలకుపైగా వేలాడింది. గాలిలో తలకిందులుగా వేలాడుతూ ఇబ్బంది పడుతున్న ఆ పావురాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పెరూ పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. బాగా ఎత్తులో ఉన్న విద్యుత్‌ వైర్‌కు చిక్కుకున్న ఆ పావురాన్ని అగ్నిమాపక దళం సహకారం లేకుండా కాపాడటం కష్టమని భావించారు. అయితే ఇద్దరు పోలీస్‌ అధికారులకు ఒక ఉపాయం తోచింది. నిఘా కోసం వినియోగించే డ్రోన్‌తో దానిని కాపాడ వచ్చని భావించారు. దీంతో కెమేరా ఉన్న మినీ డ్రోన్‌కు ఒక చాకును కట్టారు. ఆ డ్రోన్‌ను మెల్లగా పావురం వద్దకు తీసుకెళ్లారు.

- Advertisement -

కెమేరా ద్వారా పావురం కాళ్లకు దారం చుట్టుకుని ఉండటాన్ని పరిశీలించారు. విద్యుత్‌ తీగ నుంచి పావురం కాళ్లకు చిక్కుకున్న దారాన్ని చాలా జాగ్రత్తగా డ్రోన్‌కు కట్టిన చాకుతో కట్‌ చేశారు. దీంతో ఆ పావురం కింద ఏర్పాటు చేసిన వలలో పడింది. అనంతరం దాని కాళ్లకు చుట్టుకున్న దారాన్ని తొలగించారు. ఆ పావురాన్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు.

కాగా, పావురాన్ని డ్రోన్‌తో రెస్క్యూ చేయడాన్ని పెరూ పోలీసులు సోషల్‌ మీడియాలో లైవ్‌ టెలీకాస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. పోలీసుల ఆలోచనను నెటిజన్లు ప్రశంసించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement