మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 12:48:30

మ‌చు పిచుపై అత‌నొక్క‌డే..

మ‌చు పిచుపై అత‌నొక్క‌డే..

హైద‌రాబాద్‌: లాటిన్ దేశం పెరులో మచు పిచు.. ఫేమ‌స్ ప‌ర్యాట‌క ప్రాంతం. అయితే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ కొండ ప్రాంతాన్ని మూసివేశారు. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌ర్యాట‌కుల కోసం ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేశారు.  ఇన్‌కా నాగ‌రికుల‌కు చెందిన మ‌చు పిచు శిథిల క‌ట్ట‌డాల‌ను చూసేందుకు ఓ జ‌పాన్ ప‌ర్యాట‌కుడి వెళ్లాడు.  ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా పేరుగాంచిన మ‌చు పిచు కొండ‌పై కేవ‌లం అతొన్క‌డే టూర్ చేయ‌డం విశేషం.  జ‌పాన్‌కు చెందిన‌ జెస్సీ క‌ట‌యామా మ‌చు పిచు ప‌ర్వ‌త ప్రాంతాన్ని ఒక్క‌డే ఎక్కాడు.  వాస్త‌వానికి అత‌ను మార్చిలో ఆ టూర్ చేయాల‌నుకున్నాడు. కానీ క‌రోనా వైర‌స్ వ‌ల్ల త‌న ప్లాన్ వాయిదా ప‌డింది. అయితే ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకున్న జెస్సీ క‌ట‌యామా తాజాగా ఆ ప్రాచ‌నీ క‌ట్టాల‌ను తిల‌కించాడు. మార్చిలో పెరు చేరుకున్న క‌ట‌యామా.. ట్రావెల్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఆ దేశంలోనే ఇన్నాళ్లూ చిక్కుకున్నాడు.  మ‌చు పిచు ప‌ర్యాట‌క ప్రాంతాన్ని వ‌చ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఓపెన్ చేయ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు.  logo