ఆదివారం 05 జూలై 2020
International - May 27, 2020 , 12:34:04

చనిపోయినట్టుగా నటించిన పెరూ మేయర్‌..ఫొటోలు వైరల్‌

చనిపోయినట్టుగా నటించిన పెరూ మేయర్‌..ఫొటోలు వైరల్‌

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కొన్నాళ్లుగా చాలా వరకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు హోంక్వారంటైన్‌లో ఉండాలని, బయటకు రావొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు, పోలీసులు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రభుత్వాల విజ్ఞప్తిని లెక్కచేయడం చేయడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పెరూలోని టంటారా పట్టణ మేయర్‌ జైమే రొలాండో అర్బినా టొర్రెస్‌ లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లంఘించారు. అంతేకాదు తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు చనిపోయినట్లుగా నటించి..వారి నుంచి తప్పించుకుందామనుకున్నారు. 

సోమవారం రాత్రి జైమే రొలాండో తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చి పార్టీ చేసుకున్నారు. అయితే పోలీసులు రాగానే జైమే రొలాండో ఫేస్‌మాస్కు ధరించి, కండ్లు మూసి శవపేటికలో పడుకున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మేయర్‌ జైమే రొలాండో ఇలా చేశారు. జైమే రోలాండ్‌ చనిపోయిన వ్యక్తిగా నటిస్తున్నపుడు తీసిన ఫొటో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే జైమే రొలాండో స్నేహితులను అప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 

పెరూలో లాక్‌డౌన్‌ను జూన్‌ ముగిసేవరకు పొడిగించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.3 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3700 మంది కరోనాతో చనిపోయారు. పెరూ కఠినంగా లాక్‌డౌన్‌ రూల్స్‌ అమలు చేస్తుంటే టంటారా మేయర్‌ జైమే రొలాండో మాత్రం ఎమర్జెన్సీ క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటుచేయడంలో నిర్లక్ష్యం వహించారిన ఆరోపణలు కూడా ఉన్నాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo