గురువారం 21 జనవరి 2021
International - Dec 24, 2020 , 15:02:06

కరోనా లక్షణాలున్న వ్యక్తి విధులకు.. వైరస్‌ సోకి ఏడుగురు మృతి

కరోనా లక్షణాలున్న వ్యక్తి విధులకు.. వైరస్‌ సోకి ఏడుగురు మృతి

వాషింగ్టన్‌: కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆఫీస్‌లోని కొందరికి వైరస్‌ సోకడంతో ఏడుగురు మరణించారు. క్వారంటైన్‌లో ఉన్న సుమారు 300 మంది ప్రాణ భయంతో హడలిపోతున్నారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. డగ్లస్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ గత వారం ఆఫీస్‌కు వెళ్లి విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో అతడ్ని పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు అతడి ద్వారా మరికొందరికి వైరస్‌ వ్యాపించింది. ఈ క్రమంలో కరోనాబారినపడి ఏడుగురు మరణించారు. దీంతో డగ్లస్‌ కౌంటీలోని సుమారు 300 మందికిపైగా ప్రజలు స్వీయ క్వారంటైన్ విధించుకున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 37 మంది కరోనా వల్ల మరణించగా 1,315 మందికి వైరస్‌ సోకింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo