సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 06, 2020 , 13:31:37

ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌ను ప్రయోగించ‌నున్న నాసా

ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌ను ప్రయోగించ‌నున్న నాసా

హైద‌రాబాద్‌:  మార్స్ గ్ర‌హం మీద‌కు నాసా కొత్త‌గా రోవ‌ర్‌ను పంప‌నున్న‌ది.  దానికి ప‌ర్సీవ‌రెన్స్ అన్న పేరును పెట్టారు.  అంగార‌క గ్ర‌హం మీదున్న ఖ‌నిజాల‌ను ఈ రోవ‌ర్ అధ్య‌య‌నం చేయ‌నున్న‌ది.  ఆ గ్ర‌హం జీవానికి అనుకూల‌మా కాదా అన్న కోణంలో కూడా ప‌రీక్ష‌లు చేయ‌నున్న‌ది.  ఈ ఏడాది జూలై లేదా ఆగ‌స్టులో ఈ రోవ‌ర్‌ను నింగిలోకి పంపిస్తారు. సెవెన్త్ గ్రేడ్ చ‌దువుతున్న వ‌ర్జీనియాకు చెందిన అలెగ్జాండ‌ర్ మాథ‌ర్ అనే విద్యార్థి ఈ రోవ‌ర్‌కు పేరు పెట్టారు. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్స్ గ్రహంపై దిగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్ సుమారు మూడు మీట‌ర్ల పొడ‌వు ఉన్న‌ది. 2.7 మీట‌ర్ల వెడ‌ల్పుతో .. 2.2 మీట‌ర్ల ఎత్తు ఉన్న‌ది. దీని బ‌రువు 1025 కేజీలు. ప్లుటోనియం-238 వ‌చ్చే విద్యుత్తుతో ఈ రోవ‌ర్ న‌డుస్తుంది. ఫ్లోరిడాలోని కెన్న‌డీ సెంట‌ర్‌లో ప‌ర్సీవ‌రెన్స్ తుది ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. 

 


logo