మంగళవారం 26 జనవరి 2021
International - Jan 13, 2021 , 01:55:12

అమెరికాలో ‘విజయ’పథం!

అమెరికాలో ‘విజయ’పథం!

  • ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై శాశ్వత నిషేధం 
  • వెనుక  మన అమ్మాయి తెగువ

న్యూయార్క్‌: క్యాపిటల్‌ భవనంపై హింసాత్మక దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తూ ట్విట్టర్‌ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం రేపింది. అయితే ఈ అసాధారణ, సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్నది మరెవరో కాదు. మన తెలంగాణ బిడ్డ విజయ గద్దె. ప్రస్తుతం ట్విట్టర్‌ లీగల్‌ టీమ్‌ హెడ్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరింత హింస చెలరేగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా రద్దుచేస్తున్నట్టు ఆమె శుక్రవారం ట్వీట్‌చేశారు. విజయ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె మూడేండ్ల వయసులో ఉండగా వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. 


logo