బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 10:37:42

బీజింగ్‌లో మాస్క్‌లు అవ‌స‌రంలేదు..

బీజింగ్‌లో మాస్క్‌లు అవ‌స‌రంలేదు..


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల జీవ‌న విధానంలో చాలా మార్పులే వ‌చ్చేశాయి.  ఇప్పుడు బ‌య‌ట‌కు వెళ్తే మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి.  ఇండియాలో ఈ రూల్‌ను క‌చ్చితంగా అమ‌లు చేస్తున్నారు.  అయితే చైనాలోని బీజింగ్‌లో మాత్రం ఇప్పుడు ఆ నిబంధ‌న ఎత్తేశారు.  బీజింగ్ న‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు స్థానిక ప్ర‌భుత్వం కొంత ఊర‌ట‌నిచ్చింది.  ఔట్‌డోర్స్‌కు వెళ్లేవారు ముఖానికి మాస్క్‌లు ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని బీజింగ్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ప్రివెన్ష‌న్ అండ్ కంట్రోల్ సంస్థ పేర్కొన్న‌ది. ఆదివారం రోజున ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.  కానీ ప్ర‌జ‌లు ఎవ‌రు కూడా అతిస‌మీపంగా ఉండ‌కూడ‌దంటూ మ‌రో వార్నింగ్‌ ఇచ్చింది. మ‌రోవైపు చైనాలో ఇవాళ కొత్తగా 17 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక వుహాన్ న‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా టెస్టింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ప‌రీక్ష చేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. 


logo