బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 16:30:18

షాపింగ్‌కు వెళ్లిన పెంగ్విన్లు.. గిఫ్ట్ కోస‌మేన‌ట‌!

షాపింగ్‌కు వెళ్లిన పెంగ్విన్లు.. గిఫ్ట్ కోస‌మేన‌ట‌!

ప్ర‌పంచంలోనే ప్ర‌త్యేక‌మైన జీవుల‌లో పెంగ్విన్లు మొద‌టి స్థానంలో ఉన్నాయి. ఇటీవ‌ల అమెరికాలోని షెడ్ అక్వేరియం పంచుకున్న వీడియోనే ఇందుకు నిద‌ర్శ‌నం. వీడియోలో క‌నిపిస్తున్న రెండు పెంగ్విన్లు పేర్లు ఇజ్జి, కార్మెన్‌. ఇవి రెండూ దుకాణానికి వెళ్లాయి. మాల్‌లో మొత్తం తిరిగి వాటికి న‌చ్చిన గిఫ్ట్ ద‌గ్గ‌ర ఆగాయి.

37 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోకు 'పెంగ్విన్స్ బహుమతి దుకాణాన్ని అన్వేషిస్తాయి! పెంగ్విన్స్ ఇజ్జి, కార్మెన్ షెడ్ బహుమతి దుకాణానికి క్షేత్ర పర్యటనకు వెళ్లి గిఫ్ట్‌ను క‌నుగొన్నారు. ఇంకా ఎక్కువ పెంగ్విన్‌లు' అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు 42 కే మంది వీక్షించారు. ఎవ‌రైనా బాధ‌గా ఉంటే ఈ వీడియో చూడ‌గానే అంతా పోతుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతారు. మ‌రి పెంగ్విన్లు ఏం షాపింగ్ చేశాయో మీరు కూడా చూసేయండి. 


logo