ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 16:18:44

ఇది ‘స్మార్ట్‌’ పిల్లి.. సెల్ఫీలు తీసుకుంది మరీ..!

ఇది ‘స్మార్ట్‌’ పిల్లి.. సెల్ఫీలు తీసుకుంది మరీ..!

బీజింగ్‌: ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఎక్కడ చూసినా దాని వెంట్రుకలు కనిపిస్తుంటాయి. అయితే, ఇటీవల ఒక మహిళ బయటనుంచి ఇంటికిరాగానే తన టాబ్లెట్‌పై తన పిల్లి వెంట్రుకలు కనిపించాయి. దీంతో దాన్ని ఓపెన్‌చేసి చూసి షాక్‌కు గురైంది. టాబ్లెట్‌లో పిల్లి సెల్ఫీ ఫొటోలు కనిపించాయి. వీటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. 

చైనాకు చెందిన మహిళ ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌చేసింది. తన పెంపుడు పిల్లి ఎర్‌నియు సెల్పీలు తీసుకోవడం నేర్చుకుందని ఆమె చెప్పింది. ఫ్లాష్‌లైట్‌ను కూడా ఉపయోగిస్తోందని తెలిపింది. ఈ ఫొటోలకు భారీ స్పందన వస్తున్నది. నెటిజన్లు పిల్లి సెల్ఫీలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది స్మార్ట్‌ పిల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo