యుద్ధ క్షేత్రాల్లో గస్తీ నిర్వహిస్తూ, చొరబాటుదారులపై తూటాల వర్షం కురిపించే రిమోట్ కంట్రోల్డ్ సాయుధ రోబో ఇది. ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన కంపెనీ సోమవారం దీన్ని ఆవిష్కరించింది. శత్రువుల నుంచి సైనికులను రక్షించడం, పేలుడు పదార్థాలు ఉన్న ప్రాంతాల్లో కలియతిరడగం ఈ రోబో ప్రత్యేకత. ఈ రోబోపై రెండు మెషిన్ గన్లు, కెమెరా, సెన్సర్లు ఉన్నాయి.