గురువారం 28 మే 2020
International - Apr 21, 2020 , 17:26:40

బిచ్చ‌గాడి నోట ఆంగ్ల పాట‌.. ఎంత మ‌దురం

బిచ్చ‌గాడి నోట ఆంగ్ల పాట‌.. ఎంత మ‌దురం

పాట్నాకు చెందిన ఒక బిచ్చగాడు  జిమ్ రీవ్స్ .. హిల్ హావ్ టు గో అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న‌ది. రెండు నిమిషాల ఇర‌వై సెకండ్ల వీడియోను జ‌య‌రాజ‌న్ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. లాక్‌డౌన్‌లో ఆహారం కోసం ఏం చేస్తున్నారు. దొర‌క‌న‌ప్పుడు ఎలా క‌డుపు నింపుకుంటున్నార‌ని బిచ్చ‌గాడిని ప్ర‌శ్నించాడు ఆ వ్య‌క్తి. "సర్వశక్తిమంతుడు నాకు ఏది ఇచ్చినా, నేను దానితో సంతోషంగా ఉన్నాను అని బిచ్చ‌గాడు స‌మాధాన‌మ‌చ్చిడు.

అంతేకాదు అత‌ను సింగ‌ర్‌, డ్యాన్స‌ర్ అని కూడా చెప్పాడు. నా పేరు స‌న్నీ బాబా అని గ‌ట్టిగా ఓ స్టైల్‌లో చెప్పాడు. సన్నీబాబ ఆంగ్లం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌డు. అయితే ఆంగ్లంలో ఒక పాట పాడ‌గ‌ల‌రా అడిగాడు వ్య‌క్తి. స‌రే పాడుతాను కానీ కొత్త పాట కాదు, పాత పాట అన్నాడు. 1959లో అమెరిక‌న్ గాయ‌కుడు జిమ్ రీవ్స్ పాడిన పాట విల్ హావ్ టు గో అందుకున్నాడు. అప్ప‌ట్లో ఈ పాట బాగా ప్రాచుర్యం పొందిన‌ది. సేమ్ అమెరిన‌క‌న్ సింగ‌ర్ పాడిన‌ట్లుగానే అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోను కొన్ని గంట‌ల్లోనే  6 వేల మంది వీక్షించారు. బిచ్చ‌గాడి స్వ‌రం ప్ర‌తిఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ద‌ని నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో తెలియ‌జేస్తున్నారు. logo